: బుద్ధుని జన్మస్థానం అదేనా!


బుద్ధుడు లుంబినిలో జన్మించాడని చరిత్రలో మనం చదువుకున్నాం. అయితే పూర్తి చారిత్రక ఆధారాలు మనకు పెద్దగా లభించలేదనే చెప్పాలి. తాజాగా లభించిన ఆధారాలు బుద్ధుడు లుంబినిలోనే జన్మించాడనే వాదనకి బలాన్ని చేకూరుస్తున్నాయి.

క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో బుద్ధుడు ప్రస్తుతం నేపాల్‌లోని లుంబినిలో జీవించి ఉన్నట్టుగా పేర్కొనేందుకు తగు చారిత్రక ఆధారం ఒకటి లుంబినిలో బయటపడింది. ఒక పెద్ద చెక్కతో చేసిన నిర్మాణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిర్మాణానికి, బుద్ధుని చరిత్రకు దగ్గరి పోలికలున్నాయని, ఆయన క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లుంబినిలో బయల్పడిన ఈ తాజా నిర్మాణం మధ్యలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం, అందులో ఒక పెద్ద చెట్టుకు సంబంధించిన వేర్లు లభ్యమవడంతో బుద్ధుని తల్లి మాయాదేవి బుద్ధునికి ఇక్కడే జన్మనిచ్చి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News