: ఆరుషి హత్యపై సీబీఐ దగ్గర ఆధారాలు లేవు: ఆరుషి స్నేహితురాలు ఫిజా ఝా


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆరుషి జంట హత్యల కేసులో కోర్టు వెల్లడించిన తీర్పుకు విరుద్ధంగా, సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆరుషి స్నేహితురాలు ఫిజా ఝా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఆరుషి హత్యకు సంబంధించి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, పరిస్థితుల డిమాండ్ మేరకే సీబీఐ అలా వ్యవహరించిందని ఫిజా వ్యాఖ్యానించింది. అనుమానితులను అరెస్టు చేయాలనే ఒకే కారణంతో తల్వార్ దంపతులను అరెస్టు చేశారని, ఆరుషి కేసులో న్యాయం చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదని ఫిజా పేర్కొంది. ఈ హత్య కేసులో నిజమైన దోషులకు శిక్ష విధించినప్పుడే ఆరుషికి తగిన న్యాయం చేకూరుతుందని ఫిజా అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News