: రాయల తెలంగాణ పేరుతో కేంద్రం మరోసారి వంచిస్తోంది: ఎర్రబెల్లి
కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణను తెరపైకి తెచ్చి ప్రజలను మరోసారి వంచిస్తోందని టి.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పదిజిల్లాలతో కూడిన తెలంగాణనే తాము కోరుతున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో పాటే సీమాంధ్రుల సమస్యలనూ పరిష్కరించాలని కోరారు.