: శాసనసభను సమావేశపరచాలని గవర్నర్ ను కోరాం: జానారెడ్డి
తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన వెంటనే శాసనసభను సమావేశపరచాలని గవర్నర్ ను కోరినట్లు మంత్రి జానారెడ్డి తెలిపారు. అయితే, ముసాయిదా బిల్లు అసెంబ్లీకి పంపితే ఆలస్యమవుతుందనే భావన ప్రజల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ ను కోరారు.