: ఈ మెయిల్ లాటరీతో వల.. 49 లక్షలకు కుచ్చుటోపీ.. అరెస్టు


ఈ మెయిల్ లో లాటరీలతో వల విసిరి రూ. 49 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, దేశంలో కొన్ని నైజీరియన్ ముఠాలు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. భారీ మొత్తం గెలుచుకున్నారంటూ ఈ మెయిల్ పంపించడం, తమను సంప్రదించాలని ఓ నెంబర్ పంపించడం, ఆ నెంబర్ ను సంప్రదించిన వారిని నిలువునా ముంచడం ఇదీ వీరి తరహా. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్ మోసగాళ్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మెయిళ్లు, ఎస్ఎంఎస్ లకు మోసపోవద్దని కమిషనర్ ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News