: ఆరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు
ఆరుషి జంట హత్యల కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ లకు ఘజియాబాద్ సీబీఐ కోర్టు జీవితఖైదు విధించింది. దాదాపు ఐదున్నర సంవత్సరాల పాటు కొనసాగిన దర్యాప్తు, సుదీర్ఘ విచారణ అనంతరం... ఈరోజు వారిద్దరికీ శిక్షను ఖరారు చేసింది. ఆరుషి తల్లిదండ్రులను సీబీఐ కోర్టు నిన్ననే దోషులుగా తేల్చి జైలుకి తరలించింది.
శిక్షకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్న సమయంలో... ఈ కేసును అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైనదిగా భావించాలని సీబీఐ కౌన్సిల్ ఆర్.కె.శైనీ కోర్టుకు తెలిపారు. కన్న కూతురినే హత్య చేసిన వీరిద్దరికీ మరణ శిక్షే సరైందని వాదించారు. అయితే, తల్వార్ల తరఫున వాదించిన డిఫెన్స్ లాయర్ తన్వీర్ మిర్... తన క్లయింట్లు కావాలని ఈ నేరం చేయలేదని, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదని... అందువల్ల శిక్ష తీవ్రతను తగ్గించాలని కోరారు.