: సెన్సార్ బోర్డు అధికారిణి ధనలక్ష్మిపై మరోసారి వర్మ పిటిషన్


సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిణి ధనలక్ష్మిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి హైదరాబాదు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తన(వర్మ) దర్శకత్వంలో రూపొందిన 'సత్య-2' చిత్రం రిలీజ్ కాకుండా సెన్సార్ పేరుతో ధనలక్ష్మి అడ్డుకోవాలని చూస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై వర్మ రెండుసార్లు పిటిషన్ వేయగా కోర్టు వాటిని తోసిపుచ్చింది. తాజాగా, మరోసారి పిటిషన్ వేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News