: పోలవరం టెండర్లలో బాబుకు ముడుపులు: హరీష్ రావు


ముడుపులు అందుకున్నందునే పోలవరం టెండర్ల విషయంలో బాబు మౌనంగా ఉంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టుపై హడావిడి చేస్తున్న బాబు పోలవరం విషయంలో కిమ్మనకుండా ఉండడంలో ఔచిత్యమేంటని హరీష్ రావు ప్రశ్నించారు.

అవిశ్వాస తీర్మానం పెడితే తాము మద్దితిస్తామని చెప్పామని, అయినా టీడీపీ ముందుకు రావడంలేదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడకుండా కాపాడుతున్నది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న బాబును ఏ ప్రాంతం వారూ నమ్మే పరిస్థితి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News