: పోలీస్ స్టేషన్ పక్కనే మహిళపై యాసిడ్ దాడి
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే మహిళపై యాసిడ్ దాడి జరిగింది. మహిళపై యాసిడ్ తో ఓ యువకుడు దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం దర్యాప్తు, గాలింపు చేపట్టారు.