: రాజీవ్ మాట వినుంటే.. జ్యోతిబసు ప్రధాని అయ్యేవారు!
కమ్యూనిస్టు శిఖరం, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును ప్రధాని పదవి చేపట్టాలని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కోరిన విషయం వెలుగు చూసింది. 1990నాటి ఈ రహస్యాన్ని విశ్రాంత ఐపీఎస్ అధికారి అరుణ్ ప్రసాద్ ముఖర్జీ తన స్వీయ చరిత్రపై రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. రాజీవ్, జ్యోతిబసు, ఇంద్రజిత్ గుప్తా గురించి తెలియని నిజాలను ఆయన అందులో రాశారు. అరుణ్ ప్రసాద్ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సమయంలో 1990లో.. బసుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాజీవ్ అనధికారికంగా కోరారట. దీనిపై పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోనే నిర్ణయం తీసుకోగలవని బసు చెప్పారట. సీపీఎం తోసిపుచ్చడంతో రాజీవ్... చంద్రశేఖర్ ను ఎంచుకున్నారని అరుణ్ పుస్తకంలో వెల్లడించారు. దాంతో కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధాని అయ్యారని తెలిపారు.