: త్వరలో పంచాయితీ ఎన్నికలు : మంత్రి ఆనం
ఏప్రిల్ చివర్లో లేదా మే మొదటి వారంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాగా, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టినా ఎదుర్కొనే సత్తా, బలం కాంగ్రెస్ కు వున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదులో విలేకరులతో మాట్లాడిన ఆనం, రాష్ట్ర్రంలో విద్యుత్ సమస్యని, నీటి ఎద్దడిని కచ్చితంగా అధిగమిస్తామన్నారు.