: పార్టీపై విమర్శలు చేస్తున్న వారిపై త్వరలో చర్యలు: బొత్స
ఉద్దేశపూర్వకంగా పార్టీపై విమర్శలు చేస్తున్నవారి జాబితాను తయారు చేస్తున్నామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్ ను వీడే ఉద్దేశంతో స్వలాభం కోసం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవన్నారు. హైదరాబాదులో పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెట్టే పరిస్థితే ఉత్పన్నం కాదన్నారు. కాగా, విభజన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నేతలు తమ ప్రాంత మనోభావాలను చెప్పడంలో తప్పు లేదన్నారు. శాసనసభ సమావేశాల్లోనూ తమ ప్రజల అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్చ ప్రజాప్రతినిధులకు ఉందన్నారు. త్వరలోనే అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పూర్తిస్థాయి అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు.