: కూలీల సమ్మె ఉద్రిక్తం
కూలీల వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో కూలీలు చేస్తున్న సమ్మె ఘర్షణకు దారితీసింది. రెండ్రోజులుగా క్రయవిక్రయాలు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులు తామే పని చేసేందుకు పూనుకోవడంతో వారికి కూలీలు అడ్డుపడ్డారు. కూలీలు తమను అడ్డుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్ కు వచ్చిన రైతులే తమ ఉత్పత్తులను విక్రయించారు.