: పెను తుపానుగా మారిన లెహర్


లెహర్ తీవ్ర పెను తుపానుగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో లెహర్ స్థిరంగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం పోర్టు బ్లెయిర్ కు పశ్చిమ-వాయవ్య దిశలో 300 కి.మీ., మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 1030 కి.మీ., కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 970 కి.మీ., కళింగపట్నానికి ఆగ్నేయంగా 900 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఎల్లుండి మధ్యాహ్నం కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీవ్ర విధ్వంసం తప్పదని ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని తెలిపింది.

  • Loading...

More Telugu News