: తేజ్ పాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ 'తెహల్కా' వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ ఢిల్లీ హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట హాజరైన తేజ్ పాల్.. సహ ఉద్యోగినిపై తాను లైంగిక దాడికి ప్రయత్నించలేదని, పరిహాసం కోసం సరదాగా అలా చేశానని చెప్పుకున్నారు. మరోవైపు బీజేపీ నేతలపై తెహల్కా వ్యవస్థాపకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు పథకం ప్రకారం తనపై కుట్ర చేశారని ఆరోపించారు. బీజేపీ నేతల ఆగ్రహానికి బాధితుడిగా మారినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము బీజేపీ నేతల అవినీతిని బయటపెట్టినందుకే ఇలా చేశారని అన్నారు.