: హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో మెడకు తరుణ్ తేజ్ పాల్ కేసు


దేశంలో సంచలనం రేపుతున్న తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అత్యాచార ఘటన కేసు హాలీవుడ్ అగ్రనటుడి మెడకు చుట్టుకుంటోంది. తెహెల్కా గోవాలో నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమానికి హాలీవుడ్ అగ్రనటుడు రాబర్ట్ డీనీరో ప్రధాన వక్తగా వ్యవహరించారు. రాబర్ట్ డీ నీరోతో సమావేశమవ్వాలని పిలిచి, లిఫ్టులో మహిళా జర్నలిస్టుపై తేజ్ పాల్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు ఆయన పేరును కూడా గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.

ఈ కేసులో సాక్షిగా రాబర్డ్ డీ నీరోను గోవా డీజీపీ ఓపి మిశ్రా ప్రశ్నించనున్నారు. తేజ్ పాల్ పై నమోదైన ఈ కేసులో 'గాడ్ ఫాదర్ 2' సాక్ష్యం కీలకంగా మారడంతో రాబర్ట్ ను విచారిస్తామని మిశ్రా తెలిపారు. తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఫిర్యాదు మేరకే రాబర్ట్ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News