: చిక్కిన మరో 2 కేజీల దొంగ బంగారం
స్మగ్లర్లు పెద్ద ఎత్తున దొంగ బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్నారు. ఎన్ని తనిఖీలున్నా వారు వెరవడం లేదు. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించడంతో.. దేశీయంగా బంగారం సరఫరాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో.. అక్రమమార్గంలో పెద్ద ఎత్తున బంగారం రవాణా నడుస్తోంది. గత నెల రోజుల్లో సుమారు 10 కేసులకు పైగానే నమోదవడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా యూఏఈ నుంచి స్మగ్లర్లు దేశంలోకి బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా 60 లక్షల రూపాయల విలువజేసే 2కేజీల బంగారాన్ని కోజికోడ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. త్రిసూర్ కు చెందిన ఫామిస్ 2 కేజీల బంగారంతో షార్జా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో కోజికోడ్ లో దిగిపోయాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీలో దొరికిపోయాడు.