: షిండేతో టీ.కాంగ్రెస్ నేతల భేటీ
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంమంత్రి షిండేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని టీనేతలు షిండేను కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాల సంఖ్యతో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని... శాసన మండలికి ఈ సంఖ్య విఘాతం కలిగిస్తుందని తెలిపారు. షిండేను కలిసిన వారిలో మర్రి శశిధర్ రెడ్డితోపాటు పలువురు నేతలు ఉన్నారు.