: మరి కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా వెల్లడి
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను మరికొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ తదితరులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆజాద్ కూడా పాల్గొన్నారు. అభ్యర్థుల ఖరారు అంశం నేతలు సోనియా నిర్ణయానికే వదిలేసినట్టు తెలుస్తోంది.