: టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' రేసులో మోడీ


బీజేపీ 2014 ఎన్నికల ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' రేసులో పోటీ పడుతున్నారు. ప్రపంచంలో ఉన్న పలువురు నేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలతో కూడిన 42 పేర్లతో టైమ్స్ ఓ జాబితా తయారుచేసింది. ఆన్ లైన్ పోలింగ్ ద్వారా 'పర్సన్ ఆఫ్ ది ఇయర్-2013' టైటిల్ ను ఎవరు గెల్చుకుంటారనేది వచ్చే నెలలో ప్రకటించనున్నారు. జపాన్ ప్రధానమంత్రి షింన్జో అబె, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాకిస్థాన్ సాహస బాలిక మలాల యూసఫ్ జాయ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్, బ్రిటీష్ యువరాజ్ ప్రిన్స్ జార్జ్ జాబితాలో నిలిచారు.

  • Loading...

More Telugu News