: 3న ఢిల్లీకి కేసీఆర్
పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డిసెంబర్ 3న ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. కేసీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు కేకే, జి. వివేక్, మందా జగన్నాధం, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, బి. వినోద్ కుమార్ కూడా వెళ్లే అవకాశముంది. పార్లమెంటు సమావేశాలకు ముందే జాతీయ స్థాయిలో తెలంగాణకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒకసారి కలిసి కృతజ్ఞతలు చెబుతారని పార్టీ నేతలు తెలిపారు.
అదే సమయంలో తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతివ్వాలని వారు కోరనున్నారు. డిసెంబర్ 20 నాటికి తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లలో ఎక్కడో ఓ చోట భారీ సభ నిర్వహించాలనే ఆలోచనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ వస్తే విజయోత్సవ సభ, లేకుంటే సంపూర్ణ తెలంగాణ సాధన పేరుతో సభ పెడతామని వారు వెల్లడించారు.