: ఎన్టీఆర్ విగ్రహ శిలాఫలకం ధ్వంసం


తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన ఎన్టీఆర్ కు అగౌరవం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన దిమ్మ చుట్టూ ఉన్న గ్రానైట్, శిలాఫలకాన్ని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ పరిధిలోని దమ్మపేట క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. ఈ రోజు ఉదయం జరిగిన విషయాన్ని గమనించిన తెదేపా నాయకులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News