: సాగునీటి కోసం గొడవ.. హత్య
సాగునీటి కోసం ప్రారంభమైన ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం మాదారం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, ఈ రోజు ఉదయం వేరుశనగ పంటను తడిపే విషయంలో రామచంద్రయ్యకు, అతని సోదరులకు మధ్య గొడవ ప్రారంభమైంది. చివరకు ఇది పెద్ద ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలో, వారు రామచంద్రయ్యను దారుణంగా హతమార్చి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.