: వందల మందికి కుచ్చుటోపి.. 7 కోట్లతో ఉడాయించిన రియల్టర్


నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో అక్రమ వెంచర్ వేసి వందలాది మంది ప్రజలను నిలువునా ముంచిన ఉదంతం ఇది. తమ వెంచర్ లో స్థలాలను కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని మాయమాటలు చెప్పి 350 మందిని నిలువునా ముంచేశాడు ఓ ప్రబుద్ధుడు. వీరిందరి దగ్గర ఏకంగా రూ. 7 కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే ఉడాయించాడు. ఇంత మందికి కుచ్చుటోపీ పెట్టిన ఫోర్ ట్వంటీ పేరు శ్రీధర్. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఉండే నార్కట్ పల్లి ప్రాంతంలో యశోధర టౌన్ షిప్ పేరుతో అక్రమ లేఔట్ ను డెవలప్ చేసి జనాల దగ్గర అందినకాడికి దోచుకున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న శ్రీధర్ కోసం నాలుగు బృందాల పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News