: క్యాన్సరును గుర్తించే కొత్తరకం ఎక్స్‌రే


ఎక్స్‌రే అంటే పెద్ద పెద్ద పరికరాలే ఉండాల్సిన పనిలేదు. టేబుల్‌పై ఇమడగలిగే పరికరంతో కూడా ఎక్స్‌రే తీయవచ్చు. అందునా నాణ్యమైన చిత్రాలను తీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి సరికొత్త పరికరాన్ని పరిశోధకులు తయారుచేశారు. అంతేకాదు ఈ సరికొత్త పరికరం చిత్రించిన చిత్రాలతో క్యాన్సర్‌ కణితులను కూడా చక్కగా ముందే గుర్తించవచ్చని చెబుతున్నారు.

అమెరికాలోని నెబ్రాస్కా`లింకన్‌ వర్సిటీ పరిశోధకులు టేబుల్‌ టాప్‌ లేజర్‌తో అత్యంత నాణ్యమైన ఎక్స్‌రే చిత్రాలను తీసే విధానాన్ని రూపొందించారు. ఈ కొత్తరకం ఎక్స్‌రేతో హైడెఫినిషన్‌ సెక్యూరిటీ స్కానింగ్‌ సాధ్యమవుతుందని, దీనిద్వారా కేన్సర్‌ కణితులను ముందే గుర్తించే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా పరిశోధనలకు ఉపకరించే అత్యంత సునిశితమైన, నాణ్యమైన ఎక్స్‌రేలను సింక్రోట్రాన్‌ ఎక్స్‌రేలు అంటారు. వీటిని తీయడానికి ఒక పెద్ద భవనమంత భారీ పరికరాలను ఉపయోగిస్తారు. అలాకాకుండా ఒక ట్రక్కులో సైతం ఇమడగలిగే ఈ లేజర్‌ పరికరంతో సింక్రోట్రాన్‌ ఎక్స్‌రేలను తీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News