: రేపటి నుంచే 'ఏరో ఇండియా షో'
రకరకాల విమానాలు.... రకరకాల విన్యాసాలు...చూడ్డానికే ఒళ్ళు గగుర్పాటు చెందే అందాల అద్భుతం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. దీనికి బెంగళూరు నగరంలోని యలహంక వైమానిక స్థావరం వేదిక కానుంది. రెండేళ్లకోసారి జరిగే 'ఏరో ఇండియా' ప్రదర్శన రేపటి నుంచి అక్కడ జరుగనుంది. ఇందుకు సర్వం సిద్ధమైంది. సన్నాహకాలు కూడా మొదలయ్యాయి. దేశ, విదేశాల నుంచి యుద్ధ, పౌర విమానాల రాక, వాటి విన్యాసాలు అప్పుడే వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి. భారత నిఘా విమానం అవాక్స్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్, మరికొన్ని యుద్ధ విమానాలు నిన్న పలు విన్యాసాలు చేశాయి. రేపటి నుంచి జరిగే ఈ ఏరో ఇండియా ప్రదర్శన ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.