: తేనెటీగలు రోగాలను కూడా గుర్తుపడతాయట!


మనలో ఎలాంటి రోగాలు ఉన్నాయి? అనే విషయాన్ని గుర్తించడానికి పలు రకాలైన వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో రోగాన్ని గుర్తించడానికి ఒక్కో రకమైన పరీక్ష చేయించుకోవాలి. అలాకాకుండా మన శరీరంలోని పలు రకాలైన రోగాలకు సంబంధించిన వాసనలను పసిగట్టేలా తేనెటీగలకు నిపుణులు శిక్షణనిచ్చారు. సాధారణంగా తేనెటీగలు తేనె సువాసనను చక్కగా పసిగట్టి అక్కడికి చేరుకుంటాయి. వాటిద్వారా మనలోని రోగాలను గుర్తించవచ్చని చెబుతున్నారు.

ఊపిరితిత్తులు, చర్మం, పాంక్రియాటిక్‌ కేన్సర్లు, క్షయ వంటి వ్యాధి బాధితుల నోటినుండి వెలువడే వాసనను పరిశీలించేలా తేనెటీగలకు ప్రత్యేక శిక్షణనిస్తారు. తేనెటీగలను గుంపులుగా విభజించి ఒక్కోదానికి ఒక్కో వ్యాధి అనగా లంగ్స్‌, చర్మ వ్యాధి, పాంక్రియాటిక్‌ కేన్సర్లు, డయాబెటిస్‌, టీబీ వంటి వాటికి సంబంధించిన వాసన పసిగట్టే శిక్షణనిస్తారు. ఇది పావ్లావ్‌ రిఫ్లెక్స్‌ విధానంలో పదినిమిషాలు కొనసాగుతుంది. ఇలా శిక్షణనిచ్చిన తేనెటీగల ద్వారా రోగి వ్యాధిని నిర్ధారించేందుకు పోర్చుగీస్‌కు చెందిన డిజైనర్‌ ఒక సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఇందులో రెండు గదులుంటాయి. ఒకదాంట్లో శిక్షణ పొందిన తేనెటీగలను ఉంచి, రెండవ దాంట్లోకి రోగిని శ్వాస ఊదమంటారు. ఆ శ్వాసలో ఉండే వాసనలను పసిగట్టి ఏ తేనెటీగలు వేగంగా ఆ గదిలోకి దూసుకువస్తాయో పరిశీలించి వ్యాధిని నిర్ధారణ చేస్తారు.

  • Loading...

More Telugu News