: రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: గాలి ముద్దుకృష్ణమ నాయుడు


రాష్ట్రంలో వరుసగా తుపానులు వస్తున్నా రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మంత్రులు ప్రాంతాల వారిగా విడిపోయారని అన్నారు. రాష్ట్రానికి తుపానులతో 10 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News