: మీకు చెప్పింది 25 శాతమే... అధిష్ఠానంతో ఇంకా గట్టిగానే మాట్లాడా: సీఎం
'మీకు చెప్పినవన్నీ 25 శాతమే... అంతకన్నా ఎక్కువగా, గట్టిగా అధిష్ఠానంతో మాట్లాడా'మని సీఎం కిరణ్ తెలిపారు. విభజనపై అధిష్ఠానం మనసు మార్చుకునేలా చాలా ఒత్తిడి తీసుకొస్తున్నామని అన్నారు. విభజన విషయంలో ఏం చేస్తున్నానో రోజూ మీరే చూస్తున్నారని మీడియాను ఉద్దేశించి అన్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న దానికంటే మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందనుకుంటే... రాష్ట్ర విభజన గురించి ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కలిసుండాలనే ఇప్పటికీ కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. విభజన వల్ల రెండు రాష్ట్రాలకు మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అన్నారు. రాష్ట్రం, దేశం బలంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.