: మమ్మల్ని వేధిస్తూ 900 బస్సులు సీజ్ చేశారు: ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్
ఆర్టీఏ అధికారులు తమను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారని ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 20 వేల మంది యజమానులు ట్రావెల్స్ పై ఆధారపడి జీవిస్తున్నారని అసోసియేషన్ తెలిపింది. స్టేజీ గ్యారేజీల వంకతో తమ బస్సులను సీజ్ చేస్తున్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 900 బస్సులు సీజ్ చేశారని అసోసియేషన్ తెలిపింది. బస్సు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లించే ఏర్పాటు చేస్తున్నామని ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ తెలిపింది.