: 'మీడియా సర్కార్' న్యూస్ పోర్టల్ పై ఏఏపీ పరువు నష్టం దావా
అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. 'మీడియా సర్కార్' అనే న్యూస్ పోర్టల్ పై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసింది. న్యూస్ పోర్టల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో.. పార్టీకి భారీగా వచ్చిన విరాళాలు కొంతమంది రాజకీయ నేతలు ఇచ్చినట్లు చూపారని ఏఏపీ పేర్కొంది. మరోవైపు ఓ హిందీ వార్తా చానల్ కు కేజ్రీవాల్ ఇటువంటి నోటీసే పంపగా, మరో రెండు చానళ్లకు పరువునష్టం నోటీసులు పంపాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. కాగా, తమపై పలు చానల్స్ ప్రసారం చేసిన విషయాలపై త్వరలో 'నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్స్' (ఎన్ బీఏ), 'ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా'(పీసీఐ)లకు ఫిర్యాదు చేస్తామని పార్టీ నేత ఒకరు తెలిపారు.