: విభజనను అడ్డుకోవడానికి నా శక్తి సరిపోదు: పళ్లంరాజు
రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని... దానికి తన శక్తి కూడా సరిపోదని కేంద్ర మంత్రి పళ్లంరాజు స్పష్టం చేశారు. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఒత్తిడి మేరకే మంత్రివర్గంలో కొనసాగాల్సి వచ్చిందని అన్నారు. మానవ వనరుల శాఖ చాలా కీలకమైందని... ఆ శాఖ పనితీరు ఆగిపోతే ప్రజలు నష్టపోతారని ప్రధాని చెప్పినట్టు పళ్లంరాజు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడానికి కేంద్ర మంత్రుల బృందం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఈ రోజు బెంగళూరులో ఉన్నత విద్యాశాఖ మంత్రుల భేటీలో పాల్గొన్న పళ్లంరాజు అనంతరం మీడియాతో మాట్లాడారు.