: పార్టీని వీడాలనుకునే వారు వెళ్లిపోవచ్చు: బొత్స


కాంగ్రెస్ ను వీడాలని ఎవరైనా అనుకుంటే వెంటనే వెళ్లిపోవచ్చని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నేతలను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే వివరణ కోరుతూ వారికి నోటీసులు పంపుతామన్నారు. అయితే, పార్టీని వీడాలనుకునేవారు తెలంగాణ బిల్లు పెట్టేవరకూ ఆగనవసరం లేదన్నారు బొత్స. ఇతర పార్టీల వైపు చూసేవాళ్లే.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ను ముద్దాయి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, అసెంబ్లీని ప్రోరోగ్ చేయడం వల్ల లాభం కానీ, నష్టం కానీ లేవన్నారు. ప్రోరోగ్ అంశం సమస్యే కాదని, పరిపాలన అంశం మాత్రమేనని పేర్కొన్నారు. అసెంబ్లీకి ఈ నెలాఖరులోగా తెలంగాణ బిల్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News