: రెండు రోజుల సమయం ఇవ్వండి.. అన్నీ చెబుతాం: కేజ్రీవాల్
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీస్ పై వివరణ ఇచ్చేందుకు, తనకు మరో రెండు రోజుల గడువు కావాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈసీని కోరారు. ఇందుకు సంబంధించి ఆయన ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. ముస్లింలు ఏఏపీ కే ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంచడంపై, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా తనయుడు హరీష్ ఖురానా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
దీంతో ఎన్నికల సంఘం ఈ నెల 20న కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. తాము అధికారం కోసమో, డబ్బు కోసమో ముస్లింలను ఓటు వేయాలని కోరలేదని... అవినీతి లేని సమాజాన్ని నిర్మించడానికి వారి సహాయం ఆమ్ ఆద్మీ పార్టీకి కావాలన్న ఉద్దేశ్యంతోనే ఓటు వేయాలని కోరామని కేజ్రీవాల్ తెలిపారు.