: చేయని నేరానికి బలిపశువుల్ని చేశారు... హైకోర్టులో అప్పీల్ చేస్తాం


ఆరుషి జంట హత్యల కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ లను ఘజియాబాద్ సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. రేపు వీరిద్దరికీ శిక్షను ఖరారుచేయనుంది. తీర్పు వెలువడిన అనంతరం వీరిద్దరూ స్పందించారు. చేయని నేరానికి తమను బలిపశువుల్ని చేశారని వాపోయారు. కోర్టు తీర్పుతో తామెంతో కుంగిపోయామని అన్నారు. అయితే తాము ఓటమిని అంగీకరించమని... సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం వీరిద్దరినీ ఘజియాబాద్ దస్నా జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News