: మహిళను హింసించి.. సామూహిక అత్యాచారం
కీచకులు పేట్రేగి పోతున్నారు. మృగాళ్లు చేస్తున్న అత్యాచారాలు సమాజాన్ని మరింత దిగజారుస్తున్నయి. చట్టాలు, శిక్షలు వీరిని మార్చలేకపోతున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన అసోంలోని లఖింపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్కూలు నుంచి తన బిడ్డను తీసుకొచ్చేందుకు షేరింగ్ వాహనం ఎక్కిన ఓ మహిళను... ఆమె ప్రయాణించిన షేరింగ్ టెంపోలోనే నలుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేశారు.
అత్యాచారానికి పాల్పడిందే కాకుండా కళ్లుపీకి, దారుణంగా హింసించి పోలీసు స్టేషన్ కు 50 మీటర్ల దూరంలో వాహనంలోంచి తోసేశారు. వాహనంలోంచి తోసేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో ఆమె మృత దేహంతో మహిళా సంఘాలు, స్థానికులు పెద్దఎత్తున జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నేరగాళ్లను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో కొన్ని గంటల తరువాత వారు ఆందోళన విరమించారు.