: తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకూ సమాన వాటా ఇవ్వాలి: బాబు
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చావలిపాడులో తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకూ సమాన హక్కు కల్పించాలని కోరారు. అందరూ తలుచుకుంటే మహిళలపై వేధింపులు ఆగిపోతాయని సూచించారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. ఇక, స్ఠానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది ఎన్టీఆరేనని బాబు గుర్తు చేశారు.