: ఆరుషిని హత్య చేసింది తల్లిదండ్రులే: సీబీఐ కోర్టు తీర్పు


సంచలనం సృష్టించిన ఆరుషి, హేమ్ రాజ్ ల జంట హత్యల కేసులో... ఆరుషి తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ తల్వార్ లను ఘజియాబాద్ సీబీఐ కోర్టు దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. అయితే, వారికి శిక్షను రేపు ఖరారు చేయనుంది. దాదాపు ఐదున్నరేళ్ల పాటు జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆరుషిని హత్య చేసింది ఆమె తల్లిదండ్రులేనంటూ మొదటి నుంచి వాదిస్తున్న సీబీఐతో కోర్టు ఏకీభవిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాజేష్, నుపుర్ లు కోర్టు ఆవరణలోనే భోరున విలపించారు. అనంతరం వీరిద్దరినీ కోర్టు ఆదేశాల మేరకు ఘజియాబాద్ దస్నా జైలుకు తరిలించారు.

  • Loading...

More Telugu News