: వేధింపులకు గురైన తెహల్కా మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా
తెహల్కా మేగజీన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ చేత గోవాలోని ఫైవ్ స్టార్ హోటల్ లో వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మహిళా జర్నలిస్టు తరుణ్ తేజ్ పాల్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు ఏం కావాలి? ఎందుకు పోలీస్ కేసు పెట్టింది? అనే విషయాలు తెలుసుకునేందుకు వచ్చిన తరుణ్ తేజ్ పాల్ బంధువును కూడా వెళ్లిపోమ్మని నిలదీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు.