: బొత్సతో ముగిసిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ల సమావేశం


రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ల సమావేశం ముగిసింది. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తామని రవాణా మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంప్లాయీస్ యూనియన్ల సంఘం తెలిపింది. దీనికి సంబంధించి సాయంత్రంలోగా జీవో విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సంఘం నేతలు చెప్పారు. ఈ నెల 30 కల్లా 9,518 మందిని రెగ్యులరైజ్ చేస్తామన్నారని వెల్లడించారు. మిగిలిన వారిని దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తామన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News