: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరుతూ టీడీపీ లేఖ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరుతూ సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, లోక్ సత్తా పార్టీలకు శుక్రవారం టీడీపీ లేఖ రాసింది. త్వరలో 10 ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో తమకు మద్దతునివ్వాలని లేఖలో తెలుగుదేశం విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంచితే, కృష్ణాజిల్లా ఆలపాడులో శనివారం ఉదయం 10.30 గంటలకు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది.