: మనవడి పుట్టిన రోజు సంబరంలో అమితాబ్
మెగాస్టార్ అమితాబ్ తన మనవడు (కూతురు శ్వేత కొడుకు) అగస్త్య 13వ పుట్టిన రోజులో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆయన తాజాగా తన బ్లాగులో పెట్టారు. టీనేజీలోకి అడుగుపెట్టిన అగస్త్యకు అభినందనలంటూ పోస్ట్ చేశారు. ఈ నెల 23న జరిగిన పార్టీలో అమితాబ్ నల్లటి జాకెట్ ధరించి ఉన్నారు.