: నన్ను లేడీ గాగాతో పోల్చకండి: కంగనారనౌత్


ప్రముఖ గాయని లేడీగాగాతో తనను పోల్చవద్దంటూ నటి కంగనారనౌత్ కోరింది. ఫ్యాషన్లలో కంగన ఎప్పుడూ ముందుంటుంది. గాగా కూడా అంతే. దీంతో అభిమానులు ఈమెను గాగాతో పోల్చడం మొదలుపెట్టారు. ఫ్యాషన్ విషయంలో నేడు ప్రతీ మహిళ చాలా ముందున్నదంటూ కంగన పేర్కొంది. మిలే సైరస్ గానీ, లేదా లేడీ గాగా అయినా అందరూ ఫ్యాషన్లతో ప్రయోగాలు చేస్తున్నారని చెప్పింది. మనదేశంలోనూ ఫ్యాషన్ల విషయంలో మహిళలు బలంగా దూసుకుపోవాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News