: రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో సీఎం అయ్యా: ముఖ్యమంత్రి కిరణ్
మూడేళ్ల క్రితం తాను సీఎం అయినప్పుడు ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ. 9 వేల కోట్లకు పైగా ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో తాను సీఎం అయ్యాయని... ఆ సమయంలో సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులను సక్రమంగా వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని అన్నారు. కడప జిల్లా రాయచోటిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం కిరణ్ ప్రసంగిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అవసరమా? అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రం కలిసుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.