: ప్రజలు ఎలా బతుకుతారు? : మోడీ
బీజేపీ తక్కువ కాలం పరిపాలించినా, సత్తా చాటిందని బీజేపీ ప్రధాని అభ్యర్తి నరేంద్ర మోడీ తెలిపారు. ఫోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా వాజ్ పేయి మన దేశ సత్తాను ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. రాజస్థాన్ లోని ఖేత్రిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తాము గుజరాత్ లో 9 వేల గ్రామాలకు పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు జీతాలు సరిపోవడం లేదని... ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపట్టకపోతే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రూపాయి విలువ పడిపోయి, అన్నిటి ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని మోడీ పిలుపునిచ్చారు.