: వ్యక్తిగత మైలేజీ కోసం సీఎం పాకులాట: రోజా


వైఎస్ పథకాలను సీఎం కిరణ్ పేర్లు మార్చి అమలుచేస్తున్నారని వైసీపీ నాయకురాలు రోజా విమర్శించారు. ఈ రోజు ఆమె హైదరాబాద్ లోని వైకాపా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత మైలేజీ కోసం పాకులాట తప్పితే... ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రిగా కిరణ్ సాధించింది శూన్యమని రోజా తెలిపారు. ధరలు పెంచడం, ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తివేతే కిరణ్ సరికొత్త పథకమని విమర్శించారు. చంద్రబాబు పాలనకు కిరణ్ పాలన పొడిగింపంటూ ఎద్దేవాచేశారు.

  • Loading...

More Telugu News