: భద్రాచలం, మునగాల తెలంగాణలో భాగమే: టీఎన్జీవో


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. ఈ రోజు నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం, మునగాలలు తెలంగాణలో అంతర్భాగాలని... వాటిని తెలంగాణ నుంచి విడగొట్టాలని భావిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. డిసెంబర్ 1న ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News