: ధోనీ అరుదైన రికార్డు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ ఒక అత్యంత అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఒకవైపు కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. వికెట్ కీపర్ గా 150 మ్యాచులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఆటగాడిగా క్రికెట్ రికార్డుల పుస్తకంలోకి ఎక్కేశాడు. నిన్న విశాఖలో విండీస్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీకి ఈ రికార్డు సొంతమైంది. ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న తొలి కెప్టెన్ గానూ రికార్డులకెక్కాడు.