: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి: చంద్రబాబు


వరదముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు రాజమండ్రి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని బాబు విమర్శించారు. తుపాను బీభత్సంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News