: ఒకే వ్యక్తికి 52 మరణ శిక్షలు విధించిన పాక్ న్యాయమూర్తి
తెగువ అంటే అదీ..! 'మాకు శిక్ష విధిస్తే... నీకు మా చేతిలో మరణశిక్షే' అంటూ తాలిబాన్ల నుంచి బెదిరింపులు ఓవైపు పోటెత్తినా.. బాధితులకు న్యాయం చెయ్యాలన్న తపన ఆ పాకిస్తాన్ న్యాయమూర్తిని కర్తవ్యం దిశగా నడిపించింది. మూడేళ్ల క్రితం జరిగిన బాంబు దాడి కేసులో నిందితుడైన బెహ్రమ్ ఖాన్ అనే ఉగ్రవాదికి ఆసిఫ్ మాజిద్ అనే న్యాయమూర్తి ఏకంగా 52 మరణ శిక్షలు విధించి తీవ్రవాదంపై తన ఆక్రోశాన్నిచాటుకున్నాడు.
అంతేగాకుండా, ఆనాటి ఘటనలో ఆత్మాహుతి దాడికి దిగి తీవ్రంగా గాయపడిన ఫిదాయీ అనే ముద్దాయికి 52 జీవిత ఖైదు శిక్షలు విధించాడు. 2010లో పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం వద్ద ఓ ప్రార్థనా మందిరంపై దాడి కేసులో వీరిరువురు నిందితులు.